అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 141 పాయింట్ల లాభంతో ట్రేడిరగ్ ప్రారంభించిన సెన్సెక్స్(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 835 పాయింట్లు లాభపడింది. 61 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో గరిష్టంగా 263 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంతో 81,782 వద్ద, నిఫ్టీ(Nifty) 187 పాయింట్ల లాభంతో 24,872 వద్ద కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో సూచీలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం, కోవిడ్(Covid) కేసులు పెరుగుతుండడం, డాలర్ ఇండెక్స్ పైకి ఎగబాకడం, చైనా వడ్డీ రేట్లను తగ్గించడంతో ఎఫ్‌ఐఐలు అమ్మకాల బాటపట్టడం, జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం వంటి కారణాలతో గత మూడు ట్రేడింగ్ సెషన్లలో మన మార్కెట్లలో ఒత్తిడి నెలకొంది. మూడు రోజుల తర్వాత బుధవారం రిలీఫ్ ర్యాలీ కనిపిస్తోంది.
Stock Market | అన్ని రంగాలూ పాజిటివ్‌గానే..
మన మార్కెట్‌లో అన్ని రంగాల(All sectors) షేర్లు రాణిస్తున్నాయి. ప్రధానంగా కోవిడ్ భయాలతో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలలోని షేర్లు దూసుకుపోతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్(Midcap) ఇండెక్స్ 0.8 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్ 2 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.49 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్(Health care index) 1.37 శాతం పెరగ్గా.. ఆటో 1.3 శాతం, పవర్ 1.2 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 0.84 శాతం, ఇన్‌ఫ్రా 0.8 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.7 శాతం, బ్యాంకెక్స్ 0.6 శాతం పెరగ్గా.. టెలికాం, మెటల్ ఇండెక్స్‌లు అరశాతానికిపైగా లాభంతో కదలాడుతున్నాయి.
Top Gainers..
బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 2 కంపెనీలు మాత్రమే నష్టాలతో ఉన్నాయి. సన్‌ఫార్మా(Sunpharma) 2.03 శాతం లాభంతో ఉండగా.. బజాజ్ ఫైనాన్స్ 1.88 శాతం, ఎంఅండ్‌ఎం 1.4 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.29 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.28 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
Losers..
ఇండస్ ఇండ్ బ్యాంక్(Indusind bank) 1.18 శాతం నష్టంతో ఉండగా.. కొటక్ బ్యాంక్ 0.38 శాతం నష్టంతో కొనసాగుతోంది.
