Homeబిజినెస్​Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల పాయింట్ల దిగువకు...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ప్రధాన కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు (First Quarter earnings) నిరాశపరచడం, భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 66 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 141 పాయింట్లు పెరిగింది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు నిరాశ పరచడంతో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 726 పాయింట్లు పడిపోయింది. 3 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. 39 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 226 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 501 పాయింట్ల నష్టంతో 81,757 వద్ద, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 24,968 వద్ద స్థిరపడ్డాయి.

ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. మరోవైపు డీఐఐలూ దూకుడు ప్రదర్శించడం లేదు. యూఎస్‌, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం ఎటూ తేలడం లేదు. ఇప్పటివరకు వెలువడిన ఐటీ కంపెనీలతోపాటు యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ1 రిజల్ట్స్‌(Axis bank Q1 results) మార్కెట్‌ను నిరాశపరిచాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

గ్లోబల్‌ మార్కెట్లు సైతం నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,687 కంపెనీలు లాభపడగా 2,394 స్టాక్స్‌ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 143 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 45 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 3 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3,64 లక్షల కోట్లు తగ్గింది.

Stock Market | బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో సెల్లాఫ్‌..

ప్రధాన సూచీలను ఫైనాన్షియల్‌(Financial), బ్యాంక్‌ స్టాక్స్‌ వెనక్కి లాగాయి. బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 0.43 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.05 శాతం పెరిగాయి. మిగిలిన అన్ని ప్రధా సూచీలు నేలచూపులు చూశాయి. అత్యధికంగా క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 1.50 శాతం పడిపోయింది. బ్యాంకెక్స్‌(Bankex) 1.33 శాతం నష్టపోగా.. ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.99 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.66 శాతం నష్టపోయాయి. పవర్‌, కన్జూమర్‌ గూడ్స్‌ ఇండెక్స్‌లు 0.90 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ. 84 శాతం, పీఎస్‌యూ సూచీ 0.66 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.48 శాతం పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 0.64 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.62 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.38 శాతం నష్టపోయాయి.

Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 1.94 శాతం, టాటా స్టీల్‌ 1.66 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.52 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.37 శాతం, ఇన్ఫోసిస్‌ 0.24 శాతం లాభపడ్డాయి.
Top Losers:యాక్సిస్‌ బ్యాంక్‌ 5.24 శాతం, బీఈఎల్‌ 2.34 శాతం, ఎయిర్‌టెల్‌ 1.49 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.47శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.44 శాతం నష్గపోయాయి.