Homeబిజినెస్​Stock Market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రంప్‌ టారిఫ్‌ భయాలతో చివరి సెషన్‌లో భారీగా పతనమయ్యాయి.

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 111 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 182 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 425 పాయింట్లు పెరిగింది. అమ్మకాల ఒత్తిడితో గరిష్టాలనుంచి 822 పాయింట్లు పతనమయ్యింది. నిఫ్టీ(Nifty) 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై వెంటనే మరో 62 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 112 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో మళ్లీ 249 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్‌ 585 పాయింట్ల నష్టంతో 80,599 వద్ద, నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,565 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,297 కంపెనీలు లాభపడగా 2,718 స్టాక్స్‌ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 140 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 80 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6.24 లక్షల కోట్లు తగ్గింది.

Stock Market | ఎఫ్‌ఎంసీజీ ఒక్కటే..

బీఎస్‌ఈ సూచీలలో ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ ఒక్కటి మాత్రమే లాభాలతో ముగిసింది. 0.43 శాతం లాభపడిరది. మిగిలిన అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 2.44 శాతం, టెలికాం ఇండెక్స్‌ 2.41 శాతం పడిపోగా.. మెటల్‌ 1.91 శాతం, ఐటీ 1.87 శాతం, రియాలిటీ 1.78 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 1.67 శాతం, ఇన్‌ఫ్రా 1.52 శాతం, పీఎస్‌యూ 1.40 శాతం, ఎనర్జీ 1.35 శాతం, యుటిలిటీ ఇండెక్స్‌ 1.28 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.03 శాతం పతనమయ్యాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 1.59 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.37 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.93 శాతం నష్టాలతో ముగిశాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో.. 24 కంపెనీలు నష్టపపోయాయి. ట్రెంట్‌ 3.24 శాతం, ఆసియా పెయింట్‌ 1.40 శాతం, హెచ్‌యూఎల్‌ 1.17 శాతం, ఐటీసీ 1.14 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.88 శాతం లాభపడ్డాయి.

Top Losers : సన్‌ ఫార్మా 4.43 శాతం, టాటా స్టీల్‌ 3.04 శాతం, మారుతి 2.65 శాతం, టాటా మోటార్స్‌ 2.60 శాతం, ఇన్ఫోసిస్‌ 2.52 శాతం నష్టాలతో ముగిశాయి.

Must Read
Related News