అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 566 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు పెరిగాయి.
యూఎస్‌లో ద్రవ్యోల్బణం(Inflation) అంచనాలకన్నా తక్కువగా నమోదు కావడంతో ఫెడ్(Fed) వడ్డీ రేట్ల కోతపై ఆశలు పెరిగాయి. అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత మదుపరులకు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత ఆకర్షణీయంగా కనిపించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో ఎఫ్‌ఐఐ(FII)లు నికర కొనుగోలు దారులుగా మారడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. మరోవైపు భారత్(Bharat), అమెరికాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కూడా సూచీలను పరుగులు పెట్టిస్తోందన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. దీంతో సోమవారం ఉదయం మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 86 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 638 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 48 పాయింట్ల లాభంతో ప్రారంభమై 16 పాయింట్లు తగ్గినా అక్కడినుంచి కోలుకుని గరిష్టంగా 178 పాయింట్లు లాభపడిరది. చివరికి సెన్సెక్స్(Sensex) 566 పాయింట్ల లాభంతో 84,778 వద్ద, నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో 25,966 వద్ద స్థిరపడ్డాయి. రూపాయి(Rupee) విలువ 39 పైసలు బలహీన పడి 88.24 వద్ద ముగిసింది.
మెటల్, టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో జోరు..
ఫార్మా రంగం మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్ 2.37 శాతం, పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) ఇండెక్స్ 2.34 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.50 శాతం, ఎనర్జీ 1.44 శాతం, రియాలిటీ 1.42 శాతం, మెటల్ 1.10 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.98 శాతం, పీఎస్‌యూ 0.95 శాతం, కమోడిటీ 0.79 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.66 శాతం, బ్యాంకెక్స్ 0.65 శాతం లాభపడ్డాయి. హెల్త్‌కేర్(Health care) ఇండెక్స్ 0.05 శాతం నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51 శాతం లాభంతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,178 కంపెనీలు లాభపడగా 2,114 స్టాక్స్ నష్టపోయాయి. 210 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 193 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 95 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 2.56 శాతం, రిలయన్స్ 2.24 శాతం, ఎటర్నల్ 2.19 శాతం, ఎస్‌బీఐ 2.08 శాతం, టాటా మోటార్స్ 1.64 శాతం పెరిగాయి.
Top Losers : కొటక్ బ్యాంక్ 1.74 శాతం, బీఈఎల్ 1.62 శాతం, ఇన్ఫోసిస్ 1.35 శాతం, అదానిపోర్ట్స్ 0.56 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.47 శాతం నష్టపోయాయి.

