అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) దూసుకుపోతున్నాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు లాభాలతో ముగిసి, ఎనిమిది నెలల గరిష్టాలకు చేరాయి. సోమవారం ఉదయం 386 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 481 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ(Nifty) 157 పాయింట్ల లాభంతో ప్రారంభమెంది. ఇదే ఇంట్రాడే గరిష్టం. ఆ తర్వాత లాభాల స్వీకరణతో సూచీలు కాస్త వెనక్కి తగ్గాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 256 పాయింట్ల లాభంతో 82,445 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 25,103 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈలో 2,798 కంపెనీలు లాభపడగా 1,409 స్టాక్స్ నష్టపోయాయి. 128 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 178 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 43 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ రూ. 3 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
Stock Market | ఆల్‌టైం హైలో బ్యాంక్ నిఫ్టీ..
బ్యాంక్ నిఫ్టీ(Bank nifty) జీవనకాల గరిష్టాల వద్ద కొనసాగుతోంది. సోమవారం తొలిసారిగా 57 వేల మార్క్‌ను దాటింది. కొటక్, ఏయూ, యాక్సిస్, ఫెడరల్, ఇండస్ ఇండ్, పీఎన్‌బీ, కెనరా బ్యాంకు(Canara bank)లు రాణించాయి. ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే నష్టపోయింది.
Stock Market | అన్ని రంగాల షేర్లలో ర్యాలీ..
అన్ని ప్రధాన రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ(BSE) పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.59 శాతం పెరగ్గా.. ఇన్‌ఫ్రా 1.55 శాతం, పవర్ 1.43 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 1.07 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్(Oil and gas), ఎనర్జీ ఇండెక్స్‌లు ఒక శాతం లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.19 శాతం, మిడ్ క్యాప్ 1.03 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం లాభాలతో ముగిశాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. కొటక్ బ్యాంక్(Kotak bank) 3.19 శాతం పెరగ్గా.. బజాజ్ ఫైనాన్స్ 2.51 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.06 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.62 శాతం, పవర్‌గ్రిడ్ 1.61 శాతం, మారుతి 1.43 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
ఎటర్నల్(Eternal) 1.95 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.68 శాతం, టైటాన్ 0.74 శాతం, ఎంఅండ్‌ఎం 0.52 శాతం, అదాని పోర్ట్స్ 0.30 శాతం నష్టాలతో ముగిశాయి.