అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash India | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) గురువారం గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. బేర్ పంజా విసరడంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. భారీ సెల్లాఫ్తో బుల్స్ ఏ దశలోనూ పుంజుకులేకపోయాయి. చివరి గంటలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇరాన్, యూఎస్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు నష్టపోయాయి.
లాభాలతో ప్రారంభమైనా..
గురువారం ఉదయం సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 10 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 1,715 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 12 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 497 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 1,236 పాయింట్ల నష్టంతో 82,498 వద్ద, నిఫ్టీ (Nifty) 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద స్థిరపడ్డాయి.
అన్ని రంగాల్లో సెల్లాఫ్..
నిఫ్టీలో రియాలిటీ, క్యాపిట్ గూడ్స్, ఆటో, మీడియా, పవర్ సెక్టార్ల ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పడిపోయాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఐటీ రంగాల ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,237 కంపెనీలు లాభపడగా 1,955 స్టాక్స్ నష్టపోయాయి. 191 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 112 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 100 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8 లక్షల కోట్లపైనే ఆవిరయ్యింది.
Top Losers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఒక్క స్టాక్ కూడా లాభాలతో ముగియలేదు. ఇండెక్స్‌లోని అన్ని కంపెనీలూ నష్టాýతోనే ముగిశాయి. ఇండిగో 3.23 శాతం, ఎంఅండ్ఎం 2.97 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.90 శాతం, ట్రెంట్ 2.89 శాతం, బీఈఎల్ 2.70 శాతం నష్టపోయాయి.