Homeబిజినెస్​Stock market | నేడు, రేపు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.. ముహూరత్‌ ట్రేడింగ్ ఎప్పుడంటే?

Stock market | నేడు, రేపు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.. ముహూరత్‌ ట్రేడింగ్ ఎప్పుడంటే?

Stock market | దీపావళి(Diwali) లక్ష్మీపూజ సందర్భంగా నేడు, బలిప్రతిపద సందర్భంగా రేపు దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. అయితే నేడు గంటపాటు ముహూరత్‌ ట్రేడింగ్ నిర్వహిస్తారు.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Stock market | దీపావళి(Diwali) లక్ష్మీపూజ సందర్భంగా నేడు(మంగళవారం), బలిప్రతిపద సందర్భంగా రేపు(బుధవారం) దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. అయితే నేడు గంటపాటు ముహూరత్‌ ట్రేడింగ్ నిర్వహిస్తారు.

దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఇళ్లలో, వ్యాపార స్థలాలలో లక్ష్మీపూజ(Lakshmi puja)లు నిర్వహిస్తారు. సాధారణంగా వ్యాపారులు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్‌ షీట్‌ను క్లోజ్‌ చేస్తారు.

అంటే దీపావళి రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. స్టాక్‌ మార్కెట్‌(Stock market)లోనూ దీపావళి సందడి కనిపిస్తుంటుంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మూసి ఉంటాయి.

అయితే స్టాక్‌ మార్కెట్‌కు సెలవు అయినప్పటికీ ఒక గంటపాటు ముహూరత్‌ ట్రేడింగ్(Muhurat trading) సెషన్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

దీపావళి నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌కు సెలవు అయినా ఒక గంటపాటు ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఇలా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ నిర్వహించే ఏకైక దేశం మనదే. దీపావళి మరుసటి రోజు బలిప్రతిపద(Balipratipada) సందర్భంగా (అక్టోబర్‌ 22న) ఎక్స్ఛేంజీలు మూసి ఉంటాయి.

Stock market | ముహూరత్‌ ట్రేడింగ్ ఎందుకంటే..

హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన కార్యకలాపాలను చేపట్టడానికి శుభ ముహూర్తం లేదా సమయం అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్టాక్‌ మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్ నిర్వహణ దశాబ్దాలుగా వస్తోంది.

1957లో బీఎస్‌ఈ(BSE) ముహూరత్‌ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992 నుంచి ఎన్‌ఎస్‌ఈ కూడా నిర్వహిస్తోంది. మార్కెట్‌ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీనిని పరిగణిస్తారు.

దీనిని వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ(Equity) సెగ్మెంట్‌, ఈక్విటీ డెరివేటివ్‌ సెగ్మెంట్‌, సెక్యూరిటీస్‌ లెండిరగ్‌ అండ్‌ బారోయింగ్‌ (ఎస్‌ఎల్‌బీ) తదితర సెగ్మెంట్‌లలో ముహూరత్‌ ట్రేడింగ్ ఉంటుంది.

Stock market | ముహూరత్‌ ట్రేడింగ్ సమయాలు..

  • ప్రీ ఓపెనింగ్‌ సెషన్‌ : మధ్యాహ్నం 1:30 నుంచి 1:45 గంటల వరకు నిర్వహిస్తారు.
  • ముహూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ : మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఉంటుంది.
  • ట్రేడ్‌ సవరణలు మధ్యాహ్నం 2:55 వరకు అనుమతించబడతాయి.
  • నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(NSE), బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రెండిరటిలోనూ ముహూరత్‌ ట్రేడింగ్ ఉంటుంది.