- Advertisement -
Homeబిజినెస్​Stock market | ట్రంప్‌ యూటర్న్‌.. వాల్‌స్ట్రీట్‌ పరుగులు.. భారీ గ్యాప్‌ అప్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

Stock market | ట్రంప్‌ యూటర్న్‌.. వాల్‌స్ట్రీట్‌ పరుగులు.. భారీ గ్యాప్‌ అప్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు. ఆయన చేసే వ్యాఖ్యలు స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరతకు కారణమవుతుంటాయి. అయితే ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో బుల్స్‌కు స్థైర్యాన్నిచ్చాయి. చైనాపై రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ గతంలోలాగా భయంకరంగా ఉండకపోవచ్చని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీంతోపాటు ఫెడ్‌ చైర్మన్‌(Fed chairman) పొవెల్‌ను తొలగించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు భారీ ర్యాలీ తీశాయి. దీని ప్రభావం యూరోప్‌(Europe), ఆసియా మార్కెట్లలోనూ కనిపించింది. అమెరికాకు చెందిన నాస్‌డాక్‌(Nasdaq) 2.71 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 2.51 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 1.3 శాతం లాభంతో కొనసాగుతోంది.

Stock market | యూరోప్‌ మార్కెట్లలో ర్యాలీ..

యూరోప్‌ మార్కెట్లు సైతం రాణించాయి. డీఏఎక్స్‌(DAX) 0.41 శాతం మేర పెరగ్గా ఎఫ్‌టీఎస్‌ఈ 0.64 శాతం, సీఏసీ 0.55 శాతం లాభపడ్డాయి.

- Advertisement -

Stock market | పాజిటివ్‌గానే ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు(Asian markets) సైతం పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 3.7 శాతం లాభంతో కొనసాగుతుండగా.. హంగ్‌సెంగ్‌(HangSeng) 1.8 శాతం, నిక్కీ 1.6 శాతం, కోస్పీ 1.3 శాతం, స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.75 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.75 శాతం లాభంతో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లూ భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లు(Net buyers)గా నిలిచారు. మంగళవారం నికరంగా రూ. 1,290 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐ(DII))లు మాత్రం నికరంగా రూ. 885 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.5 శాతం పెరిగి 63.98 కు చేరింది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.2 శాతం పెరిగి 99.13 వద్ద కొనసాగుతోంది.
  • యూఎస్‌ 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.93 శాతం తగ్గి 4.35 వద్ద ఉంది.
  • రూపాయి విలువ స్వల్పంగా పడిపోయింది. డాలర్‌(Dollar)తో 6 పైసలు తగ్గి 85.20 వద్ద ఉంది.
  • Q4 ఎర్నింగ్‌ సీజన్‌ కొనసాగుతోంది. పలు కంపెనీలు అంచనాలకు మించి మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
  • ఇండియా జీడీపీ గ్రోత్‌(GDP growth) అంచనాలను ఐఎంఎఫ్‌ 6.5 శాతంనుంచి 6.2 శాతానికి తగ్గించింది.
- Advertisement -
- Advertisement -
Must Read
Related News