ePaper
More
    Homeబిజినెస్​Stock market | నష్టాల్లో ముగిసిన సూచీలు

    Stock market | నష్టాల్లో ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) మంగళవారం నష్టాలతో ముగిశాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ (Bharath)వృద్ధి రేటు మందగించవచ్చన్న మూడీస్‌ (moodys) అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఉదయం 111 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 185 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 39 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో సూచీలు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 80,641 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 24,379 వద్ద స్థిరపడ్డాయి.

    భారత్, పాక్ (india – pakistan) మధ్య యుద్ధ భయాలకుతోడు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ (moodys) మనదేశ వృద్ధి అంచనాలను 6.7 శాతంనుంచి 6.3 శాతానికి తగ్గించడంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50లో హీరోమోటార్‌ (Hero motor), టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌ టాప్‌ గెయినర్లుగా నిలవగా.. అదాని ఎంటర్‌ప్రైజెస్‌, ఎటర్నల్‌(Eternal), జియో ఫిన్‌, ట్రెంట్‌ వంటి స్టాక్స్‌ (stocks) టాప్‌ లాసర్స్‌గా నిలిచాయి.

    stock market | ఆటో మినహా అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

    ఆటో(Auto) మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) ఇండెక్స్‌ అత్యధికంగా 5.11 శాతం నష్టపోయింది.. పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.77 శాతం పడిపోగా.. పవర్‌(Power), ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మీడియా, కన్జూమర్‌ గూడ్స్‌, ఫార్మా, రియాలిటీ తదితర సూచీలు సైతం భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ (Small cap) ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పడిపోయాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.70 శాతం నష్టపోయింది. ఆటో ఇండెక్స్‌ మాత్రమే స్వల్పంగా లాభపడింది.

    బీఎస్‌ఈ(BSE)లో 779 కంపెనీలు లాభపడగా 3,167 స్టాక్స్‌ నష్టపోయాయి. 126 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. 63 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 78 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    stock market | Top Losers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌(Sensex) 30 ఇండెక్స్‌లో 19 కంపెనీలు నష్టాలతో ముగియగా 11 కంపెనీలు లాభపడ్డాయి. ఎటర్నల్‌ 3.08 శాతం పతనమవ్వగా.. టాటా మోటార్స్‌(Tata motors), ఎస్‌బీఐ రెండు శాతానికిపైగా పడిపోయాయి. అదాని పోర్ట్స్‌, ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌(Axis bank) ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

    stock market | Top Gainers..

    ఎయిర్‌టెల్‌(Airtel) 1.66 శాతం, టాటా స్టీల్‌ 1.62 శాతం, ఎంఅండ్‌ఎం 1.59 శాతం పెరిగాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే ఒక శాతానికిపైగా లాభపడ్డాయి.

    More like this

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...

    Transco | ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు డైరెక్టర్​ మోహన్​రావుకు ఘనస్వాగతం

    అక్షరటుడే, ఇందూరు: Transco | జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు (Transco Warangal Projects) డైరెక్టర్​...

    DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

    అక్షరటుడే, ఇందూరు : DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్‌...