అక్షరటుడే, కామారెడ్డి: Police System | గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ (District SP Rajesh Chandra) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో గ్రామ పోలీస్ వ్యవస్థ (village police system), మున్సిపాలిటీల్లో (municipalities) వార్డు పోలీసులను నియమించారు. అలాగే గ్రామాలు, మున్సిపాలిటీల్లో నియమించిన పోలీసులు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ 9v) క్రియేట్ చేసి, ఆయా ప్రాంతాల్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసేలా గ్రూపులో తెలిసేలా చూడాలన్నారు.
ప్రతి అధికారి వద్ద గ్రామ, వార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామ పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేయడం కోసం ఆయా గ్రామాల్లో సంబంధిత గ్రామ పోలీసు, ఎస్సై, పోలీస్ స్టేషన్ (police station) నంబర్లను పెయింటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. దాంతో సాధారణ పౌరుడు సైతం గ్రామాల్లో ఏమి జరిగినా పోలీసులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. ప్రజల భద్రతకు తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. సమస్య ఏదైనా తమను నేరుగా సంప్రదించవచ్చని ప్రజలకు ఎస్పీ సూచిస్తున్నారు.