HomeUncategorizedManipur | మ‌ణిపూర్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు చర్య‌లు.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన 10 మంది ఎమ్మెల్యేలు

Manipur | మ‌ణిపూర్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు చర్య‌లు.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన 10 మంది ఎమ్మెల్యేలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Manipur | రాష్ట్ర‌ప‌తి పాల‌న‌లో ఉన్న‌మ‌ణిపూర్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ ఎమ్మెల్యేలు బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్ అజ‌య్‌కుమార్ భ‌ల్లా(Governor Ajay Kumar Bhalla)ను క‌లిశారు. 8 మంది బిజెపి సభ్యులతో సహా మొత్తం 10 మందికి పైగా ఎమ్మెల్యే(MLA)లు బుధవారం ఇంఫాల్‌లోని రాజ్ భవన్‌(Imphal Raj Bhavan)లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో స‌మావేశ‌మ‌య్యారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల‌ని కోరారు. మే 2023 నుంచి ఇంఫాల్ లోయకు చెందిన మైతీస్, కొండ ప్రాంతాలలో మెజారిటీగా ఉన్న కుకి వ‌ర్గాల చెల‌రేగిన హింసలో 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంత‌కీ అల్ల‌ర్లు త‌గ్గ‌పోవ‌డంతో బీజేపీ ముఖ్య‌మంత్రి ఎన్. బిరేన్ సింగ్(BJP Chief Minister N. Biren Singh) గ‌త ఫిబ్ర‌వ‌రిలో రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 13న కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. 2027 వరకు పదవీకాలం ఉన్న అసెంబ్లీని తాత్కాలికంగా రద్దు చేశారు.

Manipur | ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా..

మ‌ణిపూర్‌(Manipur)లో ప‌రిస్థితులు కుదుట ప‌డుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. బీజేపీతో పాటు కొంద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి అవ‌కాశం క‌ల్పించారు. గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అనంత‌రం స్వతంత్ర ఎమ్మెల్యే సపమ్ నిషికాంత సింగ్ (Independent MLA Sapam Nishikanta Singh) విలేక‌రుల‌తో మాట్లాడారు.

మెజారిటీ ప్రజలు ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని, అందుకే తాము గవర్నర్‌ను కలవడానికి వచ్చామ‌న్నారు. ప్రజాదరణ పొందిన ప్రభుత్వం ఏర్పాటు త్వరలో జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు నిషికాంత సింగ్ తెలిపారు. “మాకు ప్రజాదరణ పొందిన ప్రభుత్వం కావాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాము. మేమందరం సంతకం చేసిన ఒక పత్రాన్ని కూడా అంద‌జేశం మణిపూర్‌లోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని NDA ఎమ్మెల్యేలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రజల మద్దతు కూడా మాకు కావాలి. మేము ఇచ్చిన పత్రంలో దాదాపు 22 మంది సంతకాలు ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలవడానికి ఇక్కడికి వచ్చారు” అని ఆయన వివరించారు.