3
అక్షరటుడే, ఆర్మూర్: Kotapati Narasimha Naidu | రైతులు సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలికి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహ నాయుడు సూచించారు. ధర్పల్లి మండలం దుబ్బాకలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో ఆయన మాట్లాడారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధన విజ్ఞాన కేంద్రం, జయశంకర్ వర్సిటీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రుద్రూరు చెరుకు, వరి పరిశోధన శాస్త్రవేత్తలు ఫిర్దోస్ సహన, దుబ్బాక మండల ఏవో వెంకటేష్, వెటర్నరీ వైద్యుడు అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.