అక్షరటుడే, కామారెడ్డి: అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Kamareddy Collector Ashish Sangwan) ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లయ్స్ (Kamareddy civil supplies department), సహకార, గ్రామీణాభివృద్ధి, ఆర్డీవో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గతేడాదితో పోలిస్తే 134 శాతం అధికంగా కొనుగోళ్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వీణ, సివిల్ సప్లయ్స్ డీఎం రాజేందర్ (Kamareddy Civil supplies DM Rajender), డీఎస్‌వో మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఎంవో రమ్య, డీఆర్‌డీవో సురేందర్, డీపీఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.