అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని సమగ్రంగా.. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) (Greater Hyderabad Municipal Corporation) కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఐదు సంవత్సరాలకు సమగ్ర చర్యల ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు.
CM Revanth Reddy | 12 జోన్లు, 60 సర్కిళ్లుగా..
కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region)(సీయూఆర్) పరిధిలో నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ ఫీల్డ్ స్థాయిలో పర్యటించి, తమ జోన్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని సూచించారు. నగరంలో అత్యంత క్లిష్టంగా మారిన చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నెలలో మూడు రోజులు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు.
నగరవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉపయోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచిచారు. సీయూఆర్ పరిధిలో డీజిల్ బస్సులు (diesel buses), ఆటోలకు బదులుగా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాంప్రదాయ గుడ్ గవర్నెన్స్ నుంచి ఆధునిక స్మార్ట్ గవర్నెన్స్ వైపు మార్పు తీసుకురావాలని చెప్పారు.