అక్షరటుడే, ఎల్లారెడ్డి : Election Commission | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం (డిసెంబర్ 29) అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
Election Commission | వార్డుల వారీగా విభజన:
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ (Notification)లో పేర్కొంది.
షెడ్యూల్ ఇలా:
30.12.2025 : ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటాను మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరణ
31.12.2025 : వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజించడం
31.12.2025 : మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ
01.01.2026 : (Draft) ఓటర్ల జాబితా ప్రచురణ (అభ్యంతరాల స్వీకరణ)
05.01.2026 – 06.01.2026 : రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ (ULB/జిల్లా స్థాయి)
10.01.2026 : తుది ఓటర్ల జాబితా (Final Roll)
జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సవరణలు ఉంటే స్వీకరిస్తారు. తర్వాత జనవరి 10, 2026న తుది జాబితాను ప్రకటిస్తారు.
ఈ జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది.