HomeUncategorizedTerror Attack | నాతో ఉండిపో నాన్న.. కంటతడి పెట్టించిన బాలుడి మాటలు

Terror Attack | నాతో ఉండిపో నాన్న.. కంటతడి పెట్టించిన బాలుడి మాటలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్ pahalgam​లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో యావత్​ దేశం దిగ్బ్రాంతికి గురైంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీరని శోకం మిగిలింది. భార్య పిల్లలతో కలిసి కశ్మీర్​ అందాలు చూడటానికి వెళ్లిన నెల్లూరు nelluru జిల్లా కావలికి చెందిన మధుసూదన్​ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని చూసి కుమారుడు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది. “లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న” అంటూ మధుసూదన్​ మృతదేహంపై కుమారుడు దత్తు పడుకొని ఏడ్చాడు. “నువ్వు నాతోనే ఎప్పటికీ ఉండు నాన్న” అంటూ రోదించడంతో అక్కడ ఉన్న వారు సైతం కంటతడి పెట్టుకున్నారు. కాగా.. కావలికి చెందిన మధుసూదన్​ బెంగళూరు Bengaluru లో సాఫ్ట్​వేర్​ software ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.