Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | గ్లోబల్‌ మార్కెట్లలో సెల్లాఫ్‌.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

PRE MARKET ANALYSIS | గ్లోబల్‌ మార్కెట్లలో సెల్లాఫ్‌.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బుధవారం వాల్‌స్ట్రీట్‌ లాభాలతో ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు నష్టపోయాయి. గురువారం ప్రధాన ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్‌(Trade) అవుతున్నాయి. యూఎస్‌కు చెందిన నాస్‌డాక్‌ (Nasdaq) 0.7 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ 0.10 శాతం స్వల్ప లాభంతో ముగిసింది.

PRE MARKET ANALYSIS | ఎరుపెక్కిన యూరోప్‌ మార్కెట్లు

యూరోప్‌(Europe) మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ(CAC), జర్మనీకి చెందిన డీఏఎక్స్‌ 0.47 శాతం మేర నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.21 శాతం నష్టపోయింది.

PRE MARKET ANALYSIS | నెగెటివ్‌లో ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు గురువారం నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.36 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.16 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. జపాన్ కు చెందిన నిక్కీ 1.12 శాతం నష్టంతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.31 శాతం, సౌత్ కొరియా స్టాక్ ఎక్స్చేంజ్ కోస్పీ(Kospi) 0.24 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.10 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.09 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు స్లైట్‌ గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PRE MARKET ANALYSIS | గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు ఒక రోజు అమ్మకాలకు పాల్పడుతుండగా.. మరోరోజు నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. మంగళవారం నికరంగా రూ. 476 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు.. బుధవారం నికరంగా రూ. 931 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. డీఐఐ(DII)లు నికరంగా రూ. 316 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర గణనీయంగా తగ్గింది. బ్యారెల్‌కు 2.28 శాతం తగ్గి 61.71 డాలర్లకు పడిపోయింది. ఇది ఎక్కువగా ఆయిల్‌ దిగుమతిపై ఆధారపడిన మనదేశానికి అనుకూలం.
  • రూపాయి విలువ 8 పైసలు పెరిగి 85.26 వద్ద నిలిచింది.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.85 నుంచి 0.89కు పెరిగింది. విక్స్‌(VIX) 5.36 శాతం తగ్గి, 17.23 వద్ద స్థిరపడిరది ఇది మార్కెట్లపై బుల్స్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.
  • యూకే, జపాన్‌ జీడీపీ డాటా వెలువడనుంది.