HomeతెలంగాణRTC MD Sajjanar | అలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండండి.. సజ్జనార్​ ట్వీట్​ వైరల్​

RTC MD Sajjanar | అలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండండి.. సజ్జనార్​ ట్వీట్​ వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC MD Sajjanar | సోషల్​ మీడియా social mediaలో ఫేమస్​ కావడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అసభ్యకర, అనైతిక వీడియోలు తీస్తూ కొందరు ఫేమస్​ అవుతుంటే.. మరికొందరు బూతులు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. అంతేగాకుండా మద్యం తాగుతూ, డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు వీడియోలు చేస్తున్నారు. ఇలా వీడియోలు చేసే వారిపై ఆర్టీసీ ఎండీ  RTC MD Sajjanar సజ్జనార్​ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు చేసిన వీడియోపై ఆయన ఎక్స్​ వేదికగా స్పందించారు. ‘పిచ్చి పలురకాలు.. వెర్రి వేయి రకాలు.. అంటే ఇదే’ అని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా.. ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో కనీసం సోయి ఉండక్కర్లేదా అని సజ్జనార్​ ప్రశ్నించారు. ఎంతో మంది యువత భవిష్యత్​ను చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్ drugs పై వీడియోలు చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇస్తారని నిలదీశారు. సోషల్ మీడియాకు బానిసై రీల్స్ పిచ్చి పట్టిన ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండాలని ఆయన యువతకు సూచించారు. వ్యూస్ views, లైక్స్ likes, కామెంట్స్ comments మాత్రేమే వీళ్లకు కావాలని, రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు ఏమైనా చేస్తారని మండిపడ్డారు. సమాజం ఎటుపోయిన, ఎవరు ఏమైపోయిన వీళ్లకు సంబంధం లేదన్నారు. అలాంటి వారికి దూరంగా ఉండమమే మంచిదన్నారు.