అక్షరటుడే, హైదరాబాద్: Organ Donation : తెలంగాణ రాష్ట్రం అరుదైన ఘనత అందుకుంది. అవయవదానంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి పది లక్షల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే.. 2024లో దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ నమోదైంది. కానీ, తెలంగాణలో దీని రేటు 4.88 గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అవయవదానంలో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణకు సత్కారం లభించింది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యు ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్స్టిటీటీవో) National Organ and Tissue Transplantation Organization (NISTTO) అవార్డును తెలంగాణకు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ (National Organ Donation Day) వేడుకలో జీవన్ దాన్ ప్రతినిధులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ పురస్కారం అందజేశారు.
అవయవదానంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Health Minister Damodar Rajanarasimha) సంతోషం వ్యక్తం చేశారు. అవయవాలు పాడైపోయినవారికి ప్రాణాలు పోయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో జీవన్‌దాన్ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
Organ Donation : ఆరోగ్యశాఖ మంత్రి హర్షం..
ధనిక, పేద బేధం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందించేలా తోట యాక్ట్ Thota Act ను అడాప్ట్ చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెడ్ కేసులు సంభవించినప్పుడు అవయవాలు వృథా చేయకుండా.. అవసరమైనవారికి దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అవయవమార్పిడి చికిత్సను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.