అక్షరటుడే, ఎల్లారెడ్డి: Khokho Tournament | క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీడీ అతిఖుల్లా, ఏఎంసీ వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు.
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక కోసం పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Pitlam Zilla Parishad High School) మైదానంలో 12 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో (state-level competitions) పాల్గొనడానికి ఎంపిక చేశారు. శిక్షణ శిబిర ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడారు.
రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు నిలబెట్టాలన్నారు. జట్టు శిక్షణకు అవసరమైన వసతులు కల్పించి సహకరించిన దాతలు కవిత, దశరథం, డాకూరి వెంకట్ రెడ్డి, ఇమ్రోజ్, రమణరావులకు, అలాగే క్రీడాదుస్తులు అందించిన కొవూరి శివకుమార్, విజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో దేవిసింగ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, ప్రియాంక, సంజీవ్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్న జిల్లా జట్టు క్రీడాకారులను అభినందించారు.
Khokho Tournament | పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలు..
పెద్దపల్లి జిల్లాలో జరగనున్న 58వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (joint Nizamabad district) జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలు ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పెద్దపల్లి జిల్లా (Peddapalli district) పరిధిలోని ఇండియన్ మిషన్ ఉన్నత పాఠశాలలో జరుగనున్నాయి.
