HomeతెలంగాణWorld Environment Day | రెంజర్ల పాఠశాలకు రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

World Environment Day | రెంజర్ల పాఠశాలకు రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: World Environment Day | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ పురస్కారాలను (Green Champion Award) ప్రకటించింది. ఇందులో పాఠశాలల విభాగంలో జిల్లాలోని ముప్కాల్ (Mupkal) మండలం రెంజర్ల జడ్పీహెచ్​ఎస్​ ద్వితీయ స్థానం దక్కింది.

గత విద్యా సంవత్సరంలో చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలకు గాను రెంజర్ల పాఠశాలను ఎంపిక చేశారు. దీంతో గురువారం హైదరాబాద్​లోని (Hyderabad) రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (State Pollution Control Board) కార్యాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సుద్ధపల్లి మల్లేష్​కు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్​ను డీఈవో అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, పాఠశాల హెచ్​ఎం రవికుమార్ అభినందించారు.