అక్షరటుడే, గాంధారి: Best Teacher Award | మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు బోధించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా నూతన ఒరవడితో బోధిస్తున్నారు. దీంతో ఆమె కృషిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు (state-level best award) ఎంపిక చేసింది. ఆమెకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడంపై స్థానికులు అభినందిస్తున్నారు.
Best Teacher Award | ఇష్టంగా నేర్చుకోవాలి
పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటే మర్చిపోరని భవాని అన్నారు. మూస పద్ధతిలో కాకుండా ప్రతి దాన్ని కొత్త పద్ధతిలో విద్యార్థులకు (Students) తెలియజేస్తే వారికి నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుందన్నారు. అప్పుడు వాళ్లంతట వాళ్లే ఇష్టంగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారని, తాను కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.