ePaper
More
    Homeటెక్నాలజీStarlink service | ఇండియాలో స్టార్ లింక్ సేవలు త్వరలోనే షురూ.. తుది ఆమోదం పొందిన...

    Starlink service | ఇండియాలో స్టార్ లింక్ సేవలు త్వరలోనే షురూ.. తుది ఆమోదం పొందిన మస్క్ సంస్థ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Starlink service | ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk)కు చెందిన స్టార్ లింక్ త్వరలోనే ఇండియాలో సేవలను ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన తుది అనుమతులను ఆ సంస్థ పొందింది.

    భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (Indian National Space Promotion and Authorization Center) (IN-SPACe) నుంచి ఆమోదం లభించిందని పొందిందని, దేశంలో వాణిజ్య ఉపగ్రహ బ్రాడ్​బ్యాండ్​ కార్యకలాపాలను ప్రారంభించడానికి చివరి నియంత్రణ అడ్డంకి కూడా తొలగిపోయిందని తెలిసింది. స్టార్​ లింక్​ తన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్​ను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్​మెంట్​ (డీవోటీ) నుంచి పొందిన కొన్ని వారాల తర్వాత ఈ ఆమోదం లభించింది. ఇండియాలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు పూర్తి నియంత్రణ ఆమోదం పొందిన మూడో సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. అంతకు ముందు యూటెల్ సాట్ వన్వెబ్, రిలయన్స్ జియో మాత్రమే శాటిలైట్ సేవలకు అనుమతి పొందాయి.

    దేశంలో కార్యకలాపాలకు ప్రస్తుతం అన్ని అనుమతులు పొందిన స్టార్ లింక్ (Starlink).. ఇక ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్​ను పొందాల్సి ఉంటుంది. అలాగే, గ్రౌండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను ఏర్పాటు చేసుకోవాలి. ట్రయల్స్, టెస్టింగ్ ద్వారా జాతీయ భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు చూపించాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం సదరు కంపెనీ దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్​వే స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భద్రతాపరమైన అంశాలను పూర్తి చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం స్టార్ లింక్​కు ట్రయల్ స్పెక్ట్రమ్​ను మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Telecom Regulatory Authority of India) ఇటీవలి సిఫార్సుల ఆధారంగా, అడ్మినిస్ట్రేటివ్ శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం నియమాలు, ధరలను డీవోటీ త్వరలో ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. స్టార్​లింక్​ భారతదేశంలో VSAT ప్రొవైడర్లతో ఇప్పటికే తన మొదటి వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. ఉపగ్రహ స్పెక్ట్రమ్ కేటాయింపు ఖరారు కాకముందే ఎంటర్​ప్రైజ్​, ప్రభుత్వ బ్రాడ్​బ్యాండ్​ సేవలను మానిటైజ్ చేయడం ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఒప్పందం ఖరారు చేసుకుంది. ఈ భాగస్వామ్యాలతో భవిష్యత్తులో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, B2B, B2G విభాగాలలో ఉనికిని పెంచుకోవాలని స్టార్ లింక్ లక్ష్యంగా పెట్టుకుంది.

    Starlink service | అనుమతుల కోసం అమెజాన్ కైపర్..

    వాస్తవానికి స్టార్ లింక్ కంటే ముందే అమెజాన్ కు చెందిన ప్రాజెక్ట్ కైపర్ సేవలు ప్రారంభించాల్సి ఉంది. అన్ని భద్రతా, కార్యాచరణ తనిఖీలను పూర్తయినప్పటికీ, డీవోటీ, IN-SPACe నుంచి ఇంకా ఆమోదం రాలేదు. త్వరలో జరుగనున్న అంతర్-మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కైపర్ దరఖాస్తును పరిశీలించే అవకాశముంది. కైపర్ ఇండియాలో పెద్ద ఎత్తున శాట్కామ్ రోల్అవుట్​ను ప్లాన్ చేస్తోంది. స్టార్ లింక్ కేవలం మూడు గేట్ వే స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తుండగా, కాపర్ మాత్రం ముంబై, చెన్నైలలో 10 గేట్​వే స్టేషన్ల (10 gateway stations in Mumbai and Chennai) ఏర్పాటుకు యోచిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బ్రాడ్​బ్యాండ్​ సేవలు విస్తరించాలన్న ఆలోచనతో 27 తక్కువ-భూమి కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాలను ప్రయోగించిన కైపర్.. భారతదేశంపై కవరేజీని ఇంకా పొందలేదు. కైపర్, స్టార్​ లింక్​ రెండూ ఇండియాలో అభివృద్ధి చెందుతున్న శాట్కామ్ మార్కెట్లో త్రిముఖ పోటీని ఏర్పాటు చేస్తున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...