ePaper
More
    HomeజాతీయంStar Link | ఎల‌న్ మ‌స్క్‌ స్టార్ లింక్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.....

    Star Link | ఎల‌న్ మ‌స్క్‌ స్టార్ లింక్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లోనే సేవ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Star Link | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌(Elon Musk)కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్‌కు Star Link భారత్‌లో అనుమతి లభించింది.

    ఈ మేరకు టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలో ఈ లైసెన్స్‌ అందుకున్న మూడో సంస్థగా స్టార్‌లింక్‌ నిలిచింది. దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లోనే ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ మంజూరు చేస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వర్గాలు తెలిపాయి. స్టార్ లింక్‌కు టెలీకమ్యూనికేషన్ శాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Union Minister Jyotiraditya Scindia) వెల్లడించారు.

    ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తుది అనుమతులు జారీ చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో శాటిలైట్ కనెక్టివిటీ (Satellite connectivity) కోసం వన్ వెబ్, రిలయన్స్ సంస్థలకు అనుమతులు ఉన్నాయని, స్టార్ లింక్‌కు అనుమతుల జారీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని మంత్రి చెప్పుకొచ్చారు. త్వరలోనే లైసెన్సు జారీ అవుతుందని భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

    సర్వీస్‌ను పరీక్షించే నిమిత్తం వన్‌వెబ్, రిలయన్స్‌కు మినిమల్ ఎక్స్‌ప్లోరేటరీ బేసిస్ ప్రాతిపదికన స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగిందని చెప్పుకొచ్చారు. స్టార్ లింక్ (Star Link) సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆ తర్వాత కమర్షియల్ కార్యకలాపాల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి విధివిధానాలను ట్రాయ్ జారీ చేస్తుందని మంత్రి తెలియ‌జేశారు.

    స్టార్‌లింక్, మాస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ Space X సంస్థకు చెందిన న్యూట్రాన్స్‌ను ఆధారపడి, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడంలో ప్రత్యేకతను చూపిస్తుంది. స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో సరసమైన ధరలతో పోటీపడనుందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రారంభ ప్రమోషనల్ ఆఫర్‌(Promotional offer)లో నెలకు కేవలం రూ.840 ($10) ధరకే అపరిమిత డేటా అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ధర దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం. అయితే, ఈ ధర ప్రారంభ ఆఫర్‌కు మాత్రమే పరిమితం కావచ్చు. రెగ్యులర్ ప్లాన్‌లు కొంత ఎక్కువ ధరలో ఉండవచ్చని అంచనా. కాగా.. ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం మొదలైన రోజునే ఈ అనుమతులు జారీ కావడం గమనార్హం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...