ePaper
More
    Homeఅంతర్జాతీయంStarlink | బంగ్లాదేశ్​లో స్టార్​లింక్​ సేవలు ప్రారంభం.. రేటు ఎంతంటే?

    Starlink | బంగ్లాదేశ్​లో స్టార్​లింక్​ సేవలు ప్రారంభం.. రేటు ఎంతంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Starlink | ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్​ మస్క్ కంపెనీ స్టార్​లింక్​ (Elon Musk company Starlink) తన సేవలను బంగ్లాదేశ్​లో (bangladesh) ప్రారంభించింది. స్టార్​లింక్​ ద్వారా టవర్​ లేకున్నా.. ఉపగ్రహాల ద్వారా సిగ్నల్​ వస్తుంది. దీనికి టవర్ల అవసరం ఉండదు. అయితే సెల్​ఫోన్లకు కాకుండా బ్రాడ్​బాండ్​ కోసం స్టార్​లింక్​ సేవలు వినియోగించుకోవచ్చు.

    స్టార్ లింక్‌కు ఆర్బిట్‌లో ప్రస్తుతం ఏడు వేల వరకు ఉపగ్రహాలు (Satellites) ఉన్నాయి. వాటి ద్వారా వంద దేశాల్లో సేవలు అందిస్తోంది. అయితే దీనిద్వారా కేవలం ఇంటర్​నెట్ (Internet)​ సేవలు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం రూటర్​ లాంటి పరికరం ఉంటుంది. అది శాలిటైట్​ (Satellites) నుంచి సిగ్నల్స్​ స్వీకరించి అంతరాయం లేకుండా ఇంటర్నెట్​ అందేలా చేస్తుంది.

    బంగ్లాదేశ్​లో (Bangladesh) తాజాగా స్టార్​లింక్​ తన సేవలు ప్రారంభించింది. దీనికోసం వన్​టైం సెటప్​ కోసం రూ.39,000 (47,000 టాకా ) చెల్లించాలి. ప్రతి నెల సబ్ స్క్రిప్షన్ రూ.2,990 (4,200 టాకా) గా ఉంది. స్టార్​లింక్​ (starlink) త్వరలో భారత్​లో కూడా తన సేవలను ప్రారంభించనుంది. మన దగ్గర కూడా ఇంచుమించు ఇవే రేట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

    దేశంలో స్టార్​లింక్​ సేవల (Starlink services) కోసం ఎయిర్​టెల్​, జియో (airtel and jio) ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం దేశీయ టెలీకం రంగంలో జియో, ఎయిర్​టెల్​ మెజారిటీ వాటా కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు ఇప్పుడు స్టార్​లింక్​తో ఒప్పందాలు చేసుకోవడంతో దేశంలోని టెలీకాం రంగంలో (telecom sector) విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. త్వరలోనే స్టార్​లింక్​ భారత్​లో (india) తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.

    More like this

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...