Superstar Rajinikanth
Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుక‌కు రజనీకాంత్ (Superstar Rajinikanth), ఆమిర్ ఖాన్, నాగార్జున (King Nagarjuna), ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రరావు తదితరులు హాజరయ్యారు.అయితే ఈవెంట్‌లో అమీర్ ఖాన్ అంద‌రి ముందు రజ‌నీకాంత్ పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆయ‌న బ్లెస్సింగ్స్ తీసుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Superstar Rajinikanth | మ‌న‌సు గెలుచుకున్నాడు…

ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌ని హ‌త్తుకున్నారు అమీర్. బాలీవుడ్‌లో అంత పెద్ద స్టార్ అయిన అమీర్ ఖాన్ (Aamir Khan) ఒదిగి ఇలా చేయ‌డం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంలో అమిర్ ఖాన్ ‘దాహా’ అనే పాత్రలో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. అక్కినేని నాగార్జున విలన్ ‘సైమన్’ పాత్రలో మెర‌వ‌బోతున్నారు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఫిక్స్ అయ్యింది  తమిళం, తెలుగు, హిందీ కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందించగా, ‘పవర్ హౌస్’ థీమ్‌ బ్యాక్‌గ్రౌండ్ పాట మూవీపై అంచ‌నాలు పెంచింది.

చిత్రానికి పోటీగా వార్ 2 (War 2) అనే చిత్రం విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు చేప‌డుతున్నారు. భారీ మ‌ల్టీ స్టార‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌గా, ర‌జ‌నీకాంత్‌కి ఈ మూవీ మ‌రో మంచి హిట్ అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన కూలీ ట్రైల‌ర్ ఫ్యాన్స్‌కి తెగ న‌చ్చేసింది. ఇది చూసి మూవీ సూప‌ర్ హిట్ కావ‌డం ఖాయం అని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)