Homeక్రీడలుStar batter Richa Ghosh | వరల్డ్ కప్ స్టార్ రిచా ఘోష్‌కు ప్ర‌త్యేక‌ గౌరవం.....

Star batter Richa Ghosh | వరల్డ్ కప్ స్టార్ రిచా ఘోష్‌కు ప్ర‌త్యేక‌ గౌరవం.. ఏకంగా గ్రూప్​–1 పోస్ట్​.. డీఎస్పీగా జీతం, బోనస్‌ల‌తో క‌లిపి ఎంత వ‌స్తాయంటే..!

Star batter Richa Ghosh మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 విజయంలో కీల‌క పాత్ర పోషించిన స్టార్ బ్యాట‌ర్ రిచా ఘోష్ డీఎస్పీ ప‌దవిని అందుకుంది. ఇప్పుడు ఆమె జీతం ఎంత అందుకుంటుంది, బోన‌స్‌ల‌తో క‌లిపి ఎంత వ‌స్తాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Star batter Richa Ghosh | మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ రిచా ఘోష్ Richa Gosh ఇప్పుడు కొత్త బాధ్యతలను చేపట్టింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌ టోర్నీలో రిచా ఘోష్ అద్భుత ప్రదర్శనతో భారత్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడంలో కీలకంగా నిలిచింది.

లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై 94 రన్స్, ఫైనల్‌లో అత్యవసర సమయంలో 34 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆమె మెరిసింది. వరల్డ్ కప్ విజయానంతరం, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్మాన సభలో రిచా ఘోష్‌కు డీఎస్పీ (Deputy Superintendent of Police) పదవిని ప్రకటించారు. తాజాగా రిచా ఈ పదవిని అధికారికంగా స్వీకరించి, రాష్ట్ర పోలీసు బలగంలో చేరింది.

Star batter Richa Ghosh | సిలిగురిలో ACPగా బాధ్యతలు చేపట్టిన రిచా

రిచా ఘోష్ తన జన్మస్థలమైన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) గా బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా ఆమె సిలిగురి పోలీస్ కమిషనరేట్‌లోని సీనియర్ అధికారులను కలుసుకుని విధివిధానాలను తెలుసుకుంది.

ACP / DSP రెండు సమాన ర్యాంకులు అలానే గెజిటెడ్ ఆఫీసర్ హోదాలు. ఈ ప‌దవి బేసిక్ పే: రూ.56,100 కాగా, అలవెన్స్‌లతో కలిపి మరింత జీతం లభిస్తుంది . రిచా బాధ్య‌త‌లుగా శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణ, పోలీస్ బృందాలకు నాయకత్వం వహించడం, పరిపాలనా కార్యకలాపాలు పర్యవేక్షించడం వంటి కీలక అంశాలు ఉంటాయి.

ఈ సందర్భంగా ప్రముఖ క్యాబ్ సంస్థ ఆమెకు రూ.34 లక్షల నగదు బహుమతి కూడా అందించింది. రిచా ఘోష్‌కు లభించిన ACP / DSP ర్యాంక్, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు Siraj తెలంగాణ ప్రభుత్వం అందించిన డీఎస్పీ ర్యాంకుతో సమానమే. ఇది గెజిటెడ్ స్థాయి గౌరవమైన పదవి.

ఔ2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి ఎంట్రీ ఇచ్చిన రిచా ఘోష్ కెరీర్‌లో 2 టెస్ట్‌లు ఆడింది. 51 వ‌న్డేలు, 67 టీ20ల‌లో పాల్గొంది. 22 ఏళ్ల వయసులోనే క్రికెట్‌తో పాటు ప్రజా సేవలో అడుగుపెట్టి రిచా ఘోష్ రెండు రంగాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ బెంగాల్‌కి గర్వంగా నిలుస్తున్న రిచా, విజయాలతో పాటు శక్తివంతమైన ప్రేరణగా యువతకు నిలుస్తోంది.

Must Read
Related News