అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Yoga Day | అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్(Hyderabad)లోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు(Students) హాజరై యోగాసనాలు వేశారు. కార్యక్రమం పూర్తి అయ్యాక టిఫిన్ కోసం ఒక్కసారిగా విద్యార్థులు వెళ్లారు. దీంతో గేట్ నంబర్ 2 దగ్గర తొక్కిసలాట(Stampede) చోటు చేసుకుంది. ఈ ఘటనలలో ఓ యువతి అపస్మారక స్థితిలో వెళ్లగా.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.