Homeతాజావార్తలుMinister Tummala | సమయానికి ఆఫీస్​కు రాని సిబ్బంది.. మంత్రి తుమ్మల ఆగ్రహం

Minister Tummala | సమయానికి ఆఫీస్​కు రాని సిబ్బంది.. మంత్రి తుమ్మల ఆగ్రహం

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Tummala | సకాలంలో కార్యాలయానికి రాని అధికారులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (Agro Industries Corporation) ఆఫీసులో ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఏఈవోలు, ఏవోలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. వివిధ కార్పొరేషన్​ల పరిధిలో పని చేసే ఉద్యోగులు సైతం ఇష్టారాజ్యంగా విధులకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలో శనివారం మంత్రి తుమ్మల ఆగ్రో ఇండస్ట్రీస్​ కార్పొరేషన్​ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అయితే ఆయన ఆఫీస్​కు వెళ్లే సరికి ఉద్యోగులెవరూ రాకపోవడంతో గమనార్హం. ఆఫీస్​ టైం అయినా ఒక్కరు కూడా విధులకు రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Tummala | అధికారులకు షాక్​ ఇస్తున్న మంత్రి

కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు సేకరిస్తున్నారా.. లేదా అని మంత్రి ఆరా తీశారు. కార్యాలయం భవనాల నిర్వహణ సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాగా మంత్రి తుమ్మల (Tummala Nageswara Rao) ఆకస్మిక తనిఖీలతో అధికారులకు షాక్​ ఇస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆయన మార్కెటింగ్ శాఖ (Marketing Department) ప్రధాన కార్యాలయాన్ని, అగ్రి కమిషనరేట్‌‍ను తనిఖీ చేశారు. సమయపాలన పాటించని అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని చాలా కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్ని కార్యాలయాల్లో ఫేసియల్ రికగ్నేషన్​ (Facial Recognition) హాజరు విధానం అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్​ చేస్తున్నారు. సకాలంలో విధులకు రాని వారి జీతాల్లో కోత పెట్టాలని కోరుతున్నారు.

Must Read
Related News