HomeతెలంగాణMunicipal Commissioner | సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : నగరపాలక సంస్థ కమిషనర్

Municipal Commissioner | సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : నగరపాలక సంస్థ కమిషనర్

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Municipal Commissioner | భారీ వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar) ఆదేశించారు. నగరంలోని హమల్​వాడి, దుబ్బ బైపాస్ రోడ్, ఖానాపూర్, నిజాం కాలనీ, అర్సపల్లి, బోధన్ రోడ్, కెనాల్ కట్టా, శివాజీ నగర్ తదితర ప్రాంతాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శానిటేషన్ విభాగం (sanitation department) ఎప్పటికప్పుడు పర్యవేక్తిస్తూ ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలన్నారు.

ప్రధానంగా మురికి కాల్వలను (dirty canals) శుభ్రం చేయాలని, చెత్తాచెదారం రోడ్లపై ఉండకుండా చూడాలని ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో స్ప్రే చేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన చోట జేసీబీ వినియోగించాలని సూచించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని తెలిపారు. పాత భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలని తెలిపారు. కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ మనోహర్ రెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు ఉన్నారు.