అక్షరటుడే, డిచ్పల్లి : CMC | డిచ్పల్లి సీఎంసీలోకి వెళ్లకుండా ఛైర్మన్ షణ్ముఖ లింగంను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. సీఎంసీ డైరెక్టర్గా ఉన్న అజ్జ శ్రీనివాస్, షణ్ముఖ లింగం (Shanmukha Lingam) మధ్య గత కొన్ని నెలలుగా సీఎంసీ నిర్వహణపై వివాదం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం షణ్ముఖ లింగంను ఆస్పత్రి లోపలికి రానివ్వలేదు. అజ్జ శ్రీనివాస్ (Ajja Srinivas) లోపలికి రానివ్వొద్దని చెప్పారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో ఆయన గేటు బయటే ఉండిపోయారు. పోలీసులకు సమాచారం వెళ్లడంతో డిచ్పల్లి ఎస్సై షరీఫ్ (Dichpalli SI Sharif) అక్కడికి చేరుకొని షణ్ముఖ లింగంను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా షణ్ముఖ లింగం విలేకరులతో మాట్లాడుతూ.. తాను సీఎస్ఐ సంస్థతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అగ్రిమెంట్ చేసుకున్నానని, ఫిబ్రవరి 2025లో అగ్రిమెంట్ జరిగిందని వివరించారు.
విధులకు హాజరు కావడానికి వస్తే లోనికి రానివ్వకుండా అడ్డుకోవడంతో ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై (Security Staff) మండిపడ్డారు. తాను న్యాయపరంగా తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అగ్రిమెంట్ మేరకు సీఎంసీ సంస్థకు (CMC organization) రూ. కోటి ఇచ్చానని తెలిపారు. డైరెక్టర్ అని చెప్పుకుంటున్న అజ్జ శ్రీనివాస్ టర్మినేట్ ఎంప్లాయ్ అని, 2025 జూన్ 10వ తేదీన టర్మినేట్ అయ్యాడని నేపాల్ డూప్లికేట్ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నాడని ఆయనపై ఆరోపణలు చేశారు. మీడియా ముందు అజ్జ శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సీఎస్ఐ సంస్థ డైరెక్టర్గా నియమించిందని తప్పుడు సమాచారం ఇస్తున్నాడని ఆయన విమర్శించారు.
