46
అక్షరటుడే, ఇందూరు : Panchayat Elections | తుదివిడత ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలకు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను (Polling Centers) కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల పరిశీలకుడు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో ర్యాండమైజేషన్ (Randomization) నిర్వహించారు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా పీవో, ఏపీవో లను పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. ఈ ప్రక్రియలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నోడల్ అధికారి పవన్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.