అక్షరటుడే, మెండోరా: Sriramsagar | ఎస్సారెస్పీలోకి ఎగువ నుండి వరద తగ్గిపోయింది. దీంతో అధికారులు గేట్లు మూసివేశారు. జిల్లాలో వర్షాలు పూర్తిగా తగ్గిపోవడం, ఎగువ మహారాష్ట్రలో సైతం వర్షాలు తగ్గాయి.
Sriramsagar | ప్రస్తుతం ప్రాజెక్టులో..
ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1091 అడుగులకు (80.501 టీఎంసీలు) చేరింది. జలాశయంలో నిల్వలు పూర్తిస్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 9,654 క్యూసెక్కులు వస్తున్న నేపథ్యంలో.. అంతే మొత్తంలో 9,654 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
Sriramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల..
ప్రాజెక్టు కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ (kakatiya kaluva) ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ (laxmi Kaluva) ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే 573 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది.
Sriramsagar | నిజాంసాగర్‌లో..
నిజాంసాగర్‌కు (Nizamsagar) వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ఒక గేట్ ద్వారా 4,048 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా.. ఎగువన సింగూరు నుంచి ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో (Inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.