అక్షరటుడే, ఇందూరు: Stabbing suspects | ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించి, గత తొమ్మిది నెలలుగా తప్పించుకు తిరుగుతున్న భార్యాభర్తలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
నిందితులను శనివారం రిమాండుకు తరలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం Nizamabad district headquarters లోని రెండో ఠాణా Police Station పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
Stabbing suspects | అసలేం జరిగిందంటే..
నగరంలోని దారుగల్లీకి చెందిన అల్లావుద్దీన్ ఫారుక్ అలియాస్ జుబేర్(30) స్టీల్స్ అండ్ హార్డ్వేర్ వ్యాపారం చేస్తుంటాడు.
కాగా, గత ఫిబ్రవరి 4వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. జుబేర్పై దాడి జరిగింది.
జుబేర్ ఆటో దిగగానే.. అమీర్ అనే వ్యక్తితోపాటు అతడి భార్య ఆయేషా కలిసి దాడి చేశారు. జుబేర్ కంట్లో కారం చల్లి, కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించారు.
ఈ ఘటనపై రెండో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు పారిపోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులకు నిందితులు పట్టుబడటంతో వారిని జ్యూడీషియల్ కస్టడీ judicial custody కి తరలించారు.