ePaper
More
    HomeతెలంగాణSC,ST Commission | ఎస్టీ, ఎస్సీ కేసులను సత్వరమే పరిష్కరించాలి

    SC,ST Commission | ఎస్టీ, ఎస్సీ కేసులను సత్వరమే పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: SC, ST Commission | ఎస్టీ, ఎస్సీ కేసులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య (SC,ST Commission Chairman Bakki Venkataiah) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) అధికారులు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ, ఎస్సీ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.

    SC,ST Commission | వీడీసీల ఆగడాలతో ఇబ్బందులు..

    జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పలు సమస్యలను ఛైర్మన్​ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా గ్రామాల ఎస్సీ, ఎస్టీలపై వీడీసీల (VDC) ఆగడాలు ఎక్కువయ్యాయని పలువురు ఛైర్మన్​కు వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేయడం, వివక్షకు గురిచేయడం చేస్తున్నారని వాపోయారు. వీడీసీల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ నామామత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారని.. దీంతో వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని వివరించారు.

    అనంతరం పలు డివిజన్ పరిధిలో పోలీసు కేసులపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో(Bodhan Sub-Collector Vikas Mahato), నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Corporation Commissioner Dilip Kumar) తదితరులు పాల్గొన్నారు.

    సమీక్షలో పాల్గొన్న అధికారులు

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...