అక్షరటుడే, ఇందూరు: SSC Topper | నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌కు (Vinayak Nagar) చెందిన సిర్ప క్రితి (Sirpa Kriti) ఇటీవల పదో తరగతి ఫలితాల్లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచింది. కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మెరిసి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా ఆదివారం ఆమెను కాలనీవాసులు క్రితిని ఘనంగా సన్మానించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు సొసైటీ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, సభ్యులు భాస్కర్ రెడ్డి, రమేష్ కుమార్, సుభాష్, జయప్రకాష్, నందకుమార్, రాజేందర్, వెంకట కృష్ణ, తదితరులు ఉన్నారు.