ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​SSC notification | ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా.. ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్ వ‌చ్చింది.. అప్లై...

    SSC notification | ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా.. ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్ వ‌చ్చింది.. అప్లై చేసుకోండి..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SSC notification : ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం చాలా సంవ‌త్స‌రాలుగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌ చెబుతూ.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission – SSC) తాజాగా పెద్ద ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న 2,423 గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ ఉద్యోగాలు భ‌ర్తీ కానున్నాయి. అయితే 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్‌ 23 దరఖాస్తులకు చివరితేది.

    SSC notification : ఆల‌స్యం చేయ‌కండి..

    అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ చూడొచ్చు. అయితే 2423 ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండి పని అనుభవం కూడా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఇక వ‌య‌స్సు విష‌యానికి వ‌స్తే 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, PwBD, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(entral Government Employees), ఇతర వర్గాలకు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు మాత్రం ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    SSC notification : నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు

    • మొత్తం ఖాళీలు : 2423
    • దరఖాస్తు ప్రారంభ తేది : 02 జూన్ 2025
    • దరఖాస్తు ముగింపు తేది : 23 జూన్ 2025
    • వయో పరిమితి : పోస్టు ఆధారంగా 18 నుంచి 30 సంవత్సరాల వరకు
    • అధికారిక వెబ్‌సైట్ : ssc.gov.in

    అప్లికేషన్ ఫీజు అనేది చూస్తే కేటగిరీ ఫీజు సాధారణ / OBC / EWS₹100/-SC / ST / PWD ₹0/- (ఫీజు లేదు). చెల్లింపు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి అంటే ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి. https://ssc.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయండి. అప్లికేషన్ ఫారం నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు చెల్లించండి. చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....