HomeతెలంగాణSSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) ప్రకటించింది. ఇంటర్నల్ మార్కుల (internal marks) (20 శాతం) విధానం కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పదో తరగతి పబ్లిక్​ పరీక్షల్లో 80 శాతం ఎక్స్ టర్నల్​ మార్కులు (external marks) ఉంటాయని తెలిపింది.

SSC exams : సందిగ్ధానికి ఫుల్​స్టాప్​..

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉంటాయా.. ఉండవా.. అనే సందేహాలపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందా..? అని తెలంగాణలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూశారు.

SSC exams : గతేడాది నవంబరులో..

ఇంటర్నల్ మార్కులను సర్కారు ఇంతకు ముందు తొలగించింది. ఈ మేరకు గతేడాది నవంబరులో సర్కారు జీవో కూడా జారీ చేసింది. కాగా.. ఇటీవల ఢిల్లీలో శిక్షణ మండలి (NCERT), జాతీయ విద్యా పరిశోధన వర్క్ షాప్​ నిర్వహించింది. ఇందులో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సందేహాలు వెలువడ్డాయి. వర్క్​ షాప్​లో నిపుణులు అడిగిన ప్రశ్నలకు మనవారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో పాఠశాల విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సమగ్ర చర్చ అనంతరం పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది.