అక్షరటుడే, ఇందూరు: SSC Exam Center Rules | పదో తరగతి వార్షిక పరీక్షా (SSC Exams) కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల అనుమతి లేదని (Mobile Phone Ban) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) స్పష్టం చేశారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
SSC Exam Center Rules | పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో (SSC Exam Centers) ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు (Exam Rules) తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా ఫోన్లు తీసుకువస్తే మెయిన్ గేటు వద్దనే స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అనుమానాలు, విమర్శలు లేకుండా..
ఎలాంటి అనుమానాలు, విమర్శలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించడంలో సీఎస్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. తప్పనిసరిగా పోలీసు బందోబస్తు మధ్యే ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బయటి వ్యక్తులు ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సమయం ముగిసేంత వరకు లోపలి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు.
విద్యార్థులు అరగంట ముందే..
విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతిగదిలో తప్పనిసరిగా తగినంత వెలుతురు, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
