Homeజిల్లాలునిజామాబాద్​SRSP Flood Victims | ఒకేతాటిపైకి ఎస్సారెస్పీ ముంపు బాధితులు.. 5న కీలక సమావేశం.. ఎక్కడంటే..!

SRSP Flood Victims | ఒకేతాటిపైకి ఎస్సారెస్పీ ముంపు బాధితులు.. 5న కీలక సమావేశం.. ఎక్కడంటే..!

అక్షరటుడే, ఇందూరు: SRSP Flood Victims | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు Sri Ram Sagar Project (ఎస్సారెస్పీ SRSP) ముంపు, వరద బాధితులను ఒకేతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ముంపు, వరద కారణాలపై చర్చించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు బాధితులు స్వచ్ఛందంగా కదిలి రావాలని న్యాయవాది బీ మనోహర్ (మాజీ డీఎస్పీ) పిలుపునిచ్చారు.

నిజామాబాద్​ జిల్లా నవీపేట్ మండల కేద్రంలోని రఘుపతి రెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం (ఈ నెల 5న) మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో బోధన్ Bodhan, ముథోల్ Muthol, ఆర్మూర్ Armur, నిర్మల్ Nirmal, బాన్సువాడ Bansawada నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల ప్రజలు, రైతులు రావాలని కోరారు.

SRSP Flood Victims | తరచూ ముంపునకు..

ఎస్సారెస్పీ ప్రాజెక్టు పైన ఉన్న గ్రామాలు, పంట పొలాలు గతంలో ఎన్నడూ లేనవిధంగా ముంపునకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితులతో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు న్యాయవాది తెలిపారు.

ముంపు, వరదకు గల కారణాలను విశ్లేషించి, సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. సమస్యకు గల వాస్తవాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేద్దామన్నారు.

ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులకు వాస్తవాలను తెలియజేస్తూ వినతి పత్రాలు ఇద్దామన్నారు. అందుకని ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు.