అక్షరటుడే, బాన్సువాడ: SRNK College | పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల తనకు దేవాలయంతో సమానమని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. గురువారం కళాశాలలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో (Silver Jubilee Celebration) మాట్లాడారు. ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలకు ఘనమైన చరిత్ర ఉందని, వేల మంది ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో కొలువులు సాధించారని గుర్తు చేశారు.
అనంతరం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, (Zaheerabad MP Suresh Shetkar), ఉన్నత విద్యామండలి కమిషనర్ దేవసేన (Higher Education Council Commissioner Devasena), జైళ్ల శాఖ ఐజీ మురళి బాబు (IG Prisons Murali Babu), ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), బాన్సువాడ, బోధన్ సబ్ కలెక్టర్లు కిరణ్మయి (Bodhan Sub-Collector Kiranmayi), వికాస్ మహతో, ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ స్వామి, స్థల దాత మనవడు రోహిత్ కేడియా, పోచారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.