1
అక్షరటుడే, ఇందూరు: Induru Tirumala Temple | నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమలలో (Induru Tirumala) శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని గోవింద వనమాల క్షేత్రంలో శనివారం కల్యాణం వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు.
వేద పండితులు సంపత్ కుమారాచార్య, ప్రధానార్చకులు రోహిత్ కుమార్ ఆచార్య ఆధ్వర్యంలో కల్యాణాన్ని శాస్త్రోస్తంగా జరిపించారు. ఉత్సవానికి భక్తులు భారీ ఎత్తున హాజరై తిలకించారు. స్వామివారి సేవలో తరలించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రవణా నక్షత్రం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు నరాల సుధాకర్, నర్సారెడ్డి, రామ్మోహన్, సాయిలు, మురళి, పృథ్వి, విజయ్ స్వామి, అనిల్ స్వామి, మహేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.