Homeజిల్లాలుకామారెడ్డిTelangana Tirumala Devasthanam | భక్తి శ్రద్ధలతో శ్రీవారి కల్యాణ మహోత్సవం

Telangana Tirumala Devasthanam | భక్తి శ్రద్ధలతో శ్రీవారి కల్యాణ మహోత్సవం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala Devasthanam | బీర్కూర్ (Birkur) తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని (Srivari Kalyana Mahotsavam) ఘనంగా నిర్వహించారు.

మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ (Dronavalli Satish) కుటుంబ సభ్యులు కల్యాణం జరిపించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీలక్ష్మీ, గోదాదేవి సమేతంగా శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిగింది. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలతో వైభవంగా మహోత్సవాన్ని నిర్వహించారు.

వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, అప్పారావు, నర్సరాజు, ఆలయ మేనేజర్ విఠల్, అర్చకులు నందకిషోర్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి