అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Srivari Gold Dollar | తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Swamy) దర్శనంతో ఎంతో మంది పులకిస్తారు. స్వామివారి ప్రసాదం, లాకెట్, డాలర్లు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో టీటీడీ(TTD) భక్తుల కోసం బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచుతుంది. స్వామి వారి ప్రతిమ ఉండే ఈ డాలర్లను ధరిస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా భారతీయులు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. టీటీడీ కూడా ఈ రోజు భక్తుల కోసం ఎక్కువ సంఖ్యలో గోల్డ్ డాలర్లను(Gold Dollars) అందుబాటులో ఉంచుతుంది. దీంతో బుధవారం రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జరిగాయి. రెండు, ఐదు, పది గ్రాముల పసిడి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. నిన్న రూ.90 లక్షల విలువైన బంగార డాలర్లను భక్తులు(Devotees) కొనుగోలు చేసినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది రూ.75 లక్షల బంగారం డాలర్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. అయితే ఈ డాలర్ల రేటు బయట బంగారం ధర(Gold Rate)లతో పాటే మారుతు ఉంటుంది. అయితే రోజు కాకుండా టీటీడీ ప్రతి బుధవారం రేట్లను ఫిక్స్ చేస్తుంది.
Srivari Gold Dollar | రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు
4
3 comments
[…] ఆర్థిక అనిశ్చితులు, డాలరు dollar తో పోల్చితే రూపాయి విలువ పడిపోవడం […]
[…] డిమాండ్ పెరగడం లేదా తగ్గడం, డాలర్ Dollar బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక […]
[…] గోల్డ్ రేటు ఔన్సుకు 23 డాలర్ల dollar మేర పెరిగి 3974 డాలర్ల స్థాయికి […]
Comments are closed.