Homeఆంధప్రదేశ్Cyclone Montha | కొట్టుకుపోయిన శ్రీశైలం- హైదరాబాద్ హైవే.. రాకపోకలు బంద్

Cyclone Montha | కొట్టుకుపోయిన శ్రీశైలం- హైదరాబాద్ హైవే.. రాకపోకలు బంద్

భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం హైవే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Montha | మొంథా తుపాన్​ తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా మధ్య తెలంగాణ (Telangana)లో భారీ వర్షం పడటంతో వరద ముంచెత్తింది.

వాగులు, నదులు ఉధృతంగా పారుతున్నాయి.నాగర్​కర్నూల్​ (Nagarkurnool) జిల్లాలో భారీ వర్షంతో డిండి నదికి వరద పోటెత్తింది. వరద ధాటికి హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం (Hyderabad – Srisailam) మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. రోడ్డు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

వరంగల్-హైదరాబాద్ హైవేలో సైతం భారీగా వరద ప్రవహిస్తోంది. రాఘవాపూర్ దగ్గర రోడ్డు జలమయం అయింది. బుధవారం ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. డివైడర్​ను కూల్చేసి గ్రామస్థులు వరద నీటిని మళ్లించారు. దీంతో గురువారం ఉదయం నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అయితే రోడ్డుపై నుంచి వరద వెళ్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Cyclone Montha | శ్రీశైలంలో భక్తుల ఇబ్బంది

శ్రీశైలంలో భారీ వర్షం (Heavy Rain)తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్​ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. భక్తులకు ఆలయ అధికారులు అన్న ప్రసాదం అందజేశారు. రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు.