అక్షరటుడే, ఆర్మూర్ : Sriramsagar water level : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 90 శాతం నిండి క్రమంగా నీటిమట్టం (water level) పెరుగుతోంది. దీంతో సోమవారం (ఆగస్టు 18) ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.
ప్రాజెక్టు దిగువన గోదావరి నది (Godavari river) పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల కాపరులు, గొర్ల కాపారులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం గోదావరి నది దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.
Sriramsagar water level : 72 టీఎంసీలకు చేరిన నీటిమట్టం…
తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్(Sriramsagar) ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర(Maharashtra), నిజామాబాద్(Nizamabad), నిర్మల్ (Nirmal) జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి లక్షా 51 వేల 932 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు ) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 72.23 టీఎంసీలు,(1088.70 అడుగులు) లకు చేరింది.
Sriramsagar water level : కాల్వల ద్వారా నీటి విడుదల…
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో కాకతీయ కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా పది వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ కు 235 క్యూసెక్కులు వదులుతున్నారు. 594 క్యూసెక్కుల నీరు ఆవిరి అయిపోతుంది. మొత్తం 15,825 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.