అక్షరటుడే, బాల్కొండ: SriramSagar Project lifts gates : భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరామ్‌సాగర్ జలాశయాని (Sriram Sagar reservoir) కి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 50 వేల 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 27) 25 జలాశయం వరద గేట్లను ఎత్తేశారు. వీటి ద్వారా దిగువ గోదావరి (Godavari River)లోకి లక్ష క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.50 టీఎంసీలు కాగా 1098.80 అడుగులు 79.65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూస్తున్నారు. మిగతా వరదను దిగువకు వదులుతున్నారు.
SriramSagar Project lifts gates : కాలువల ద్వారా నీటి విడుదల..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇంద్రమ్మ వరద కాలువ Indramma flood canal హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3,500, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరికి 20 వేలు,లక్ష్మీ కాలువకు 200 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
సరస్వతీ కాలువ Saraswati canal ద్వారా 800 క్యూసెక్కులు, అలీ సాగర్ (Ali Sagar) కు 135 క్యూసెక్కులు, తాగునీటి కోసం 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 666 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.