అక్షరటుడే, బాల్కొండ: SriramSagar Project | ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో 39 గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు.
SriramSagar Project | దిగువకు నీళ్లు వదులుతున్నందున..
భారీఎత్తున ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్నందున అధికారులు ప్రాజెక్టు వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇన్‌ఫ్లోకు తగ్గట్లుగా అవుట్‌ఫ్లో ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మొత్తంగా 5,50,000 క్యూసెక్కుల వరదను 39 గేట్ల నుంచి గోదావరిలోకి వదులుతున్నారు.
తెలంగాణ (Telangana), మహారాష్ట్రలోని(Maharashtra) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరకముందే, అధికారులు ముందు జాగ్రత్తగా గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ఈ నీటి విడుదలతో గోదావరి (Godawari) నదిలో వరద ఉధృతి పెరిగి దిగువన చాలా ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది.
SriramSagar Project | నది పరిసర ప్రాంతల్లోకి వెళ్లొద్దు..
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు నది పరీవాహక ప్రాంతవాసులను హెచ్చరిస్తున్నారు. నది దగ్గరగా ఎవరూ వెళ్లవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్యప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం ఏమాత్రం చేయవద్దని సూచిస్తున్నారు.
SriramSagar Project | సోన్ వంతెనపై గోదావరి అందాలు..
శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తడంతో దిగువకు గోదావరి పరుగులు పెడుతోంది. దీంతో దిగువన సోన్ బ్రిడ్జి వద్ద గోదావరిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. బాల్కొండ(Balkonda) దాటిన తర్వాత వచ్చే సోన్ వంతెన కిందుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకులు వంతెనపై నుంచి గోదావరి ఉధృతిని తిలకిస్తున్నారు.
SriramSagar Project | ఖాళీ అయిన రామ్ సాగర్ చెరువు
అక్షరటుడే, ఇందల్వాయి: భారీ వర్షాల ధాటికి ఇందల్వాయి (Indalwai) మండలంలోని రామ్‌సాగర్ చెరువు (Rasmsagar Cheruvu) కట్ట తెగిపోగా చెరువు పూర్తిగా ఖాళీ అయ్యింది. చెరువు కింద పొలాలు పూర్తిగా కోతకు గురయ్యాయి. కట్ట తెగడంతో వరద సిర్నాపల్లితో (Sirnapally) పాటు గౌరారం తదితర ప్రాంతాలను ముంచెత్తింది.
జీకే తండా చెరువు కట్ట తెగడంతో తండాలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు.
ఇందల్వాయి మండలంలో తెగిపోయిన రామ్‌సాగర్ చెరువు కట్ట