అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation projects | ఉమ్మడి జిల్లాలో జలశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ప్రస్తుతం శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాంసాగర్(Nizam Sagar)లు జలకళను సంతరించుకున్నాయి.
Irrigation projects | ఎస్సారెస్పీలో..
ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి వస్తున్న వరద కొంతమేర తగ్గుముఖం పట్టింది. దీంతో వరద గేట్లను మూసివేసిన అధికారులు ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ (Saraswati Canal)కు 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. కాకతీయ, లక్ష్మీ కాలువలకు ప్రస్తుతం నీటి విడుదలను నిలిపివేశారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Irrigation projects | నిజాంసాగర్‌కు..
నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,498 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.
