అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మళ్లీ ఎత్తనున్నారు. రాత్రి పది గంటలకు గేట్లను తెరవనున్నారు. జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 98శాతం నిండిందని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి (AEE Kotha Ravi) తెలిపారు. ఇన్ఫ్లో భారీగా (heavy inflow) వస్తుండడంతో నీటిమట్టం పెరుగుతుండడంతో రాత్రి 10 గంటలకు మళ్లీ గెట్లను తెరనున్నట్లు పేర్కొన్నారు.
Sriram sagar project | ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram sagar project) ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కాగా.. వరద కాలువ, ఎస్కేప్ గేట్లతో పాటు వివిధ కాల్వల ద్వారా మొత్తం 29,532 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ప్రాజెక్టు నిండింది. దీంతో మరోసారి గేట్లు ఎత్తనున్నారు.
Sriram sagar project | గోదావరి వైపు వెళ్లొద్దు
ప్రాజెక్టు దిగువన గోదావరి నది (Godavari river) పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు, ప్రజలు ఎవరూ గోదావరి నది వైపు వెళ్లవద్దని సూచించారు. ఈ హెచ్చరికలు గోదావరి నదికి వరదలు ఉన్నన్ని రోజులు వర్తిస్తాయన్నారు.